![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -591 లో....రాజ్ గదిలో ఇంట్లో జరుగుతున్న సంఘటనలకి బాధపడుతుంటే.. కావ్య వస్తుంది. మీరు ఈ ఇంటికి వారసుడు.. మీరు ఎందుకిలా బాధపడుతున్నారని కావ్య అనగానే.. ఆ విషయం నువ్వు చెప్తే గానీ నాకు అర్థం కావడం లేదంటూ చిరాకుగా మాట్లాడతాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మంచి పని చేసావ్.. నీ వళ్లనే కొడుకుకి న్యాయం జరుగుతుంది.. అలాగే నా కొడుకుకి న్యాయం జరుగుతుందని రుద్రాణి అంటుంది. నీకు థాంక్స్ అని రుద్రాణి అనగానే.. అసలు నీకే థాంక్స్ చెప్పాలి ఈ ఆలోచన నాకు ఇచ్చావని ధాన్యలక్ష్మి అంటుంది.
అప్పుడే ప్రకాష్ వచ్చి ఇద్దరిని తిడతాడు. ఇప్పుడు నీ వల్ల ఆస్తులు ముక్కులు కావచ్చు.. నువ్వు అనుకున్నది జరగవచ్చు.. కొన్ని రోజులకి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ విరుచుకుపడతాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఎక్కడికి రాజ్.. లాయర్ వస్తున్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే లాయర్ వస్తాడు. అందరికి ఆస్తులు వాటా రాయండి అని సుభాష్ అనగానే.. మీకు మీ నాన్నగారు వారం క్రితం రాసిన వీలునామా గురించి చెప్పలేదా అని లాయర్ అంటాడు. లేదని అనగానే స్వయంగా లాయర్ అందరి ముందు సీతారామయ్య వీలునామా చదువుతాడు. యావదాస్తిని నా మనవరాలు కావ్య పేరునా రాస్తున్నానని సీతారామయ్య రాసినట్టుగా ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఒక సుభాష్, అపర్ణ ఇందిరాదేవి, ప్రకాష్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. నా బావ కుటుంబం ముక్కలు కాకుండా చూసాడని ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు తనకి ఆస్తులు రాయడమేంటి ఈ ఇంటి వారసులకి రాయాలని అంటారు. దీన్ని నేను ఒప్పుకోను.. నేను కోర్ట్ కి వెళ్తానని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. మరొకవైపు కావ్య తన బాధని దేవుడికి చెప్పుకుంటుంది. తరువాయి భాగంలో ఆస్తి పేపర్స్ తాళాలు ఇవి.. నాకు వద్దు ఈ బాధ్యతలు మీవే అని రాజ్ కి ఇస్తుంది కావ్య. ఇవి నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది తాతయ్య.. పెట్టుకున్న నమ్మకం కాపాడమని కావ్యతో రాజ్ పాజిటివ్ గా మాట్లాడగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |